క్వశ్చన్ పేపర్‌కు, ఆన్సర్ కీకి పొంతన లేదు.. సీయూఈటీ విద్యార్థుల ఆవేదన
- సీయూఈటీ యూజీ 2026 ప్రాథమిక ఆన్సర్ కీలో తప్పులు
- క్వశ్చన్ ఐడీలు, ప్రశ్నపత్రంలోని ఐడీలతో సరిపోలడం లేదని ఆరోపణలు
- సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్టీఏ దృష్టికి తీసుకువెళ్లిన పలువురు విద్యార్థులు
- ఫిర్యాదులపై స్పందించిన ఎన్టీఏ.. ఆందోళన వద్దని విద్యార్థులకు సూచన
- అభ్యంతరాలు తెలిపేందుకు అధికారిక వెబ్ సైట్ ద్వారా అవకాశం
కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2026 ప్రాథమిక ఆన్సర్ కీపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ఈ కీలో, తమ ప్రశ్నాపత్రాల్లోని క్వశ్చన్ ఐడీలకు, ఆన్సర్ కీలోని ఐడీలకు మధ్య పొంతన లేదని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేస్తున్నారు.
ఎన్టీఏ తన అధికారిక వెబ్ సైట్‌లో ఆన్సర్ కీ, రికార్డెడ్ రెస్పాన్స్‌లు, ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచిన కొద్దిసేపటికే ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. జూన్ 9న ఓ విద్యార్థి సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' లో స్క్రీన్‌షాట్‌లను జత చేస్తూ, "నా క్వశ్చన్ ఐడీలు దేనితోనూ సరిపోలడం లేదు, దీనిపై వివరణ ఇవ్వండి @NTA_Exams?" అని పోస్ట్ చేశారు. దీనిపై ఎన్టీఏ వెంటనే స్పందిస్తూ, తదుపరి విచారణ నిమిత్తం అప్లికేషన్ నంబర్‌ను డైరెక్ట్ మెసేజ్ చేయాలని సదరు విద్యార్థికి సూచించింది.
సీయూఈటీ యూజీ 2026 పరీక్షలు మే 11 నుంచి 31 వరకు, అలాగే జూన్ 6, 7 తేదీల్లో నిర్వహించారు. విద్యార్థులు తమ సమాధానాలను సరిచూసుకుని, ఏవైనా పొరపాట్లు ఉంటే అభ్యంతరాలు తెలిపేందుకు వీలుగా ఈ ప్రాథమిక కీని విడుదల చేశారు. ప్రతి ప్రశ్నకు నిర్ణీత రుసుము చెల్లించి అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. అందిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ సమీక్షించిన తర్వాతే తుది కీ, ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్ సైట్ ద్వారానే తెలపాలని నమోదు చేయాలని కోరింది.
ప్రస్తుతానికి, ఈ సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులు తమ దరఖాస్తు వివరాలు, రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన ఆధారాలతో పోర్టల్ ద్వారా అభ్యంతరాలు నమోదు చేస్తే, తుది కీలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఈ స్కోర్‌లే ప్రతిపాదిక కావడంతో, ఇటువంటి సాంకేతిక లోపాలు విద్యార్థుల్లో తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్నాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఎన్టీఏ
భరోసా ఇచ్చింది.